Watch: బెడిసికొట్టిన ట్రాక్టర్ స్టంట్.. పందెం కాసిన డ్రైవర్ మృతి
tractor stunt | ట్రాక్టర్లతో స్టంట్ బెడిసి కొట్టింది. ఒక ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో వేలల్లో పందెం కాసిన ఆ ట్రాక్టర్ డ్రైవర్ దాని కింద పడి మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: ట్రాక్టర్లతో స్టంట్ బెడిసి కొట్టింది. (tractor stunt ) ఒక ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో వేలల్లో పందెం కాసిన ఆ ట్రాక్టర్ డ్రైవర్ దాని కింద పడి మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. జూన్ 22న హిమ్మత్‌నగర్ అట్రియాకు చెందిన యువకులు ట్రాక్టర్ స్టంట్‌పై రూ.15,000 పందెం కాశారు. 22 ఏళ్ల నీరజ్ మౌర్య, జోగిందర్ యాదవ్ తమ ట్రాక్టర్లకు గొలుసులు కట్టారు. వాటిని ముందుకు లాగేందుకు పోటీపడ్డారు.
కాగా, స్టంట్ ప్రారంభమైన కొద్ది సెకండ్లలోనే నీరజ్ మౌర్య నడిపిన ట్రాక్టర్ నిటారుగా పైకిలేచింది. ఆ తర్వాత అది పూర్తిగా బోల్తాపడింది. దీంతో రూ.15,000 పందెం కాసిన నీరజ్ మౌర్య ఆ ట్రాక్టర్ కింద నలిగిపోయాడు. అక్కడికక్కడే మరణించాడు. ట్రాక్టర్ల స్టంట్ చూసేందుకు అక్కడ గుమిగూడిన గ్రామస్తులు ఇది చూసి షాక్ అయ్యారు. నీరజ్‌ను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరో ట్రాక్టర్ డ్రైవర్ జోగిందర్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. కాగా, ట్రాక్టర్ స్టంట్‌కు సంబంధించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Life lost in tractor stunt
In Lucknow’s Itaunja, a bet was placed between two young men. They had to show the crowd whose tractor was stronger. There was a prize of 15 thousand for this. In this stunt, the tractor overturned and a young man died.#Viralvideo #lucknow pic.twitter.com/Te5FmNtcY4
— Siraj Noorani (@sirajnoorani) June 23, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

