Waterfall | మహారాష్ట్ర (Maharashtra)ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (heavy rain) పడుతున్నాయి. దీంతో పలు జలపాతాలు జలసవ్వడులతో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో అంజనేరి జలపాతం వద్దకు వెళ్లి కొందరు పర్యాటకులు (Tourists) వరద తీవ్రతకు అక్కడ చిక్కుకుపోయారు.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు అంజనేరి జలపాతం (Anjaneri Waterfall) వద్ద ప్రవాహం పెరిగింది. దీంతో ఆదివారం సెలవు దినం కావడంతో జల సవ్వడులను ఆస్వాదించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు అక్కడికి వెళ్లారు. అదే సమయంలో అకస్మాత్తుగా వర్షం పడి వరద మరింత పెరిగింది. దీంతో పర్యాటకులు జలపాతం వద్ద చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు దాదాపు 6 గంటల పాటు శ్రమించి పర్యాటకుల్ని సురక్షితంగా అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు.
అంతా ఒకరిచేయి ఒకరు పట్టుకుని నిదానంగా కొండదిగిపోయారు. ఇందుకు సంబంధించిన భయానక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, ఇటీవలే అకస్మాత్తుగా వరద పోటెత్తడంతో రాయ్‌గఢ్ ఫోర్ట్‌లో అనేక మంది పర్యాటకులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారందరినీ కూడా అధికారులు రక్షించారు.
મહારાષ્ટ્ર
▶️અચાનક ભારે વરસાદ વચ્ચે લગભગ 6 કલાકની મહેનત બાદ વન અધિકારીઓએ અંજનેરી ધોધમાં ફસાયેલા પ્રવાસીઓને સફળતાપૂર્વક બચાવ્યા
▶️આ ઘટના રવિવારે બપોરે બની હતી, અધિકારીઓએ માનવ સાંકળ રચીને બધાને સલામત રીતે નીચે ઉતાર્યા#maharashtra #tourists #AnjaneriWaterfall pic.twitter.com/YHDYcB6XpR
— DD News Gujarati (@DDNewsGujarati) July 15, 2024
Also Read..
Lift | రెండు రోజులు లిఫ్ట్‌లోనే.. వైద్యం కోసం వచ్చిన రోగికి షాకింగ్ అనుభవం
KP Sharma Oli | నాలుగోసారి నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ ప్రమాణం