చెన్నై: తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో అంతర్గతంగా దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలో ఆ పోలీస్ ఉన్నతాధికారిని సస్పెండ్ చేశారు. (Police Officer Suspended) తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. ఐపీఎస్ అధికారి డీ మగేష్ కుమార్, 2024 డిసెంబర్ వరకు గ్రేటర్ చెన్నై ట్రాఫిక్, సౌత్ డీఐజీ, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేశారు. ఆ తర్వాత గ్రేటర్ చెన్నై ట్రాఫిక్, నార్త్, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా నియమితులయ్యారు.
కాగా, పోలీస్ అధికారి మగేష్ కుమార్ కింద పనిచేసిన మహిళా ట్రాఫిక్ పోలీసులను ఆయన లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇద్దరు మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు డీజీపీ, పోలీస్ ఫోర్స్ హెడ్ శంకర్ జివాల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనను రిజర్వ్ కేటగిరీ కింద ఉంచారు. లైంగిక వేధింపులపై వచ్చిన ఫిర్యాదులను అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ)కి పంపారు.
D. Magesh Kumar
మరోవైపు దర్యాప్తు తర్వాత మగేష్ కుమార్‌పై చర్యల కోసం డీజీపీకి సిఫార్సు చేశారు. దీంతో డీజీపీ ఆదేశాల ఆధారంగా ఆయనను హోం శాఖ సస్పెండ్ చేసింది. తీవ్రమైన అభియోగాల దృష్ట్యా మగేష్ కుమార్ క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీస్ వర్గాలు తెలిపాయి.