న్యూఢిల్లీ, మే 1: ముస్లింల పవిత్ర పండుగ రంజాన్‌ను (ఈద్-ఉల్-ఫితర్) మంగళవారం జరుపుకోనున్నారు. ఆదివారం నెలవంక కనిపించకపోవడంతో 3న పండుగ జరుపుకోవాలని ఫతేపురి మసీదు ఇమామ్ ముఫ్తీ ముఖర్రమ్ సూచించారు. దేశంలో ఎక్కడా నెలవంక కనిపించలేదని నిర్ధారించుకునేందుకు ఢిల్లీ, పశ్చిమబెంగాల్, బీహార్ తదితర ప్రాంతాల వారిని తమ కమిటీ రుయెత్-ఈ-హిలాల్ సంప్రదించినట్టు తెలిపారు. నెలవంక ఆదివారం కనిపించలేదని మర్కజీ చాంద్ కమిటీ ఖాలీద్ రషీద్ ఫిరంగి మహాలీ వెల్లడించారు. నెలవంక కనిపించలేదని పాట్నాలోని ఈదర-ఈ-షరియా పేర్కొంది.