న్యూఢిల్లీ : వారాంతం అనగానే అందరూ సరదా, చిల్లింగ్, రిక్రియేషన్ మూడ్‌లోకి వెళుతుంటారు. ఇంటర్నెట్లో ఫన్నీ వీడియోలను(Viral Video) వీక్షిస్తూ పలువురు ఎంజాయ్ చేస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో ఓ లేటెస్ట్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో చిన్నారి స్టెప్స్‌పై కూర్చున్న పిల్లితో క్యాచ్‌లు ఆడటం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Having fun together.. 😊 pic.twitter.com/prRJ5qnEc6
— Buitengebieden (@buitengebieden) February 25, 2023
ఇద్దరూ టవల్‌తో ఆడుతున్న ఈ వీడియోను బుటెన్జీబిడెన్ ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ క్యూట్ వీడియోలో బాలుడు క్యాట్ వైపు టవర్ విసరగా మెట్లపై కూర్చున్న పిల్లి దాన్ని అందుకుని తిరిగి బాలుడి వైపు విసరడం కనిపిస్తుంది. చిన్నారి నవ్వుతూ పిల్లితో క్యాచ్ ప్రాక్టీస్ కొనసాగిస్తాడు. ఈ వీడియోకు హ్యావింగ్ ఫన్ టుగెదర్ అనే క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోకు 6,00,000కుపైగా వ్యూస్ లభించాయి. పలువురు యూజర్లు ఈ వీడియోపై రియాక్టయ్యారు. వారాంతంలో లేజీ డేలో పెంపుడు జంతువులతో చిన్నారులు కలిసుండే వీడియోలు ఆకట్టుకుంటాయని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ఈ క్యూట్ వీడియోతో తాను చిల్ అయ్యానని మరో యూజర్ రాసుకొచ్చారు. పెంపుడు జంతువులతో గడిపే చిన్నారులు అదృష్టవంతులని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More :