ఏనుగులను తరిమికొట్టేందుకు తేనెటీగల పెట్టెలు.. ఎంపీలో వినూత్న ప్రయత్నం
ఏనుగులకు ఎలాంటి హానీ తలపెట్టకుండా వాటిని అడవుల్లోకి తరిమే పద్ధతులపై సరిహద్దు ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాలని ఎన్జీవో సంస్థలను కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోరింది.
భోపాల్: ఏనుగులను తరిమికొట్టేందుకు తేనెటీగల పెట్టెలు వినియోగించాలని ప్రజలకు ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని సరిహద్దు జిల్లా ప్రాంతాల్లో ఈ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల్లోని ఏనుగులు మధ్యప్రదేశ్ సరిహద్దు జిల్లా ప్రాంతాల్లోకి వస్తున్నాయి. పంటలను నాశనం చేయడంతోపాటు మనుషులపై దాడి చేస్తున్నాయి. గత ఏడాది ఏనుగుల దాడుల్లో సుమారు 8 మంది మరణించారు.
ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టింది. సరిహద్దు జిల్లా ప్రాంతాల్లోకి ప్రవేశించి పంటలను నాశనం చేసే ఏనుగులను వినూత్న పద్ధతుల్లో తరిమికొట్టాలని నిర్ణయించింది. దీని కోసం ఆ ప్రాంతాల ప్రజలకు తేనెటీగల పెట్టెలను పంపిణీ చేస్తున్నది. ఏనుగులను తరిమికొట్టడానికి ప్రభావిత ప్రాంతాల్లో తేనెటీగ పెట్టెలను ఏర్పాటు చేయాలని ప్రజలకు సూచిస్తున్నది. దీని వల్ల తేనెటీగల పెంపకాన్ని కూడా ప్రోత్సహించినట్లుగా ఉంటుందని ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు.
మరోవైపు ఏనుగులకు ఎలాంటి హానీ తలపెట్టకుండా వాటిని అడవుల్లోకి తరిమే పద్ధతులపై సరిహద్దు ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాలని ఎన్జీవో సంస్థలను కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు గత వారం ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఏనుగులను తరిమికొట్టేందుకు ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న మార్గదర్శకాలను అందులో పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

