లక్నో: భార్యాభర్తలు కలిసి ప్రభుత్వ భూమిలో నివసిస్తున్నారు. కబ్జా భూమిని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో వృద్ధ దంపతులు ఆ స్థలంలో భూ సమాధికి ప్రయత్నించారు. (Husband, Wife Attempt Bhu Samadhi) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పట్లాపూర్ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులైన గుచ్చి దేవి, రామ్‌నరేష్ ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. ఇల్లు కట్టుకుని కొంత కాలంగా అక్కడ నివసిస్తున్నారు.
కాగా, ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో భార్యాభర్తలైన గుచ్చి దేవి, రామ్‌నరేష్ భూ సమాధి ద్వారా ఆత్మహత్యకు యత్నించారు. ఏప్రిల్ 15న ఆ స్థలం వద్ద లోతుగా గొయ్యి తవ్వి అందులోకి దిగారు. ఆ తర్వాత మెడల వరకు మట్టితో పూడ్చుకున్నారు. కబ్జా చేసిన ప్రభుత్వ భూమి నుంచి తమను మాత్రమే ఖాళీ చేయిస్తున్నారని, పొరుగు వారిని ఖాళీ చేయించడం లేదని ఆ దంపతులు ఆరోపించారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. భూ సమాధికి ప్రయత్నించిన గుచ్చి దేవి, రామ్నరేష్లకు నచ్చజెప్పారు. చాలాసేపు సంప్రదింపుల తర్వాత వారిని బయటకు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
UP : जमीन ना मिलने पर देवरिया में पति-पत्नी ने ली भू-समाधि, सरकारी जमीन पर चाह रहे थे कब्जा
◆ SDM ने कहा, “दंपत्ति को कब्जा नहीं मिला, इसलिए उन्होंने भू-समाधि लेने की कोशिश की”#Deoria | Uttar Pradesh | #UttarPradesh | Deoria pic.twitter.com/tOTLyHa8P9
— News24 (@news24tvchannel) April 17, 2025