కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో సీబీఐ అధికారులు ఆ రాష్ట్ర మంత్రులు ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా ముఖర్జిలను నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో తమ కార్యాలయానికి తీసుకెళ్లి విచారిస్తున్నది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నది. సీబీఐ తీరుపై బెంగాల్ సీఎం మమతాబెనర్జితోపాటు, ఆ పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర సర్కారు కుట్ర పూరితంగానే సీబీఐని అడ్డంపెట్టకుని బెంగాల్ సర్కారుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపిస్తున్నారు.
ఇదిలావుంటే తమ నాయకుల అరెస్టుకు నిరసనగా నిజాం ప్యాలెస్‌లోని సీబీఐ కార్యాలయం ముందు టీఎంసీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తమ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీబీఐ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, భద్రతాసిబ్బంది కార్యాలయం గేట్లు మూసేసి వారిని అడ్డుకున్నారు.
West Bengal: A large number of TMC supporters staged a protest outside the CBI office after four party leaders were arrested by the agency. pic.twitter.com/hFO9dDRCM8
— ANI (@ANI) May 17, 2021