రెబల్స్ ఆధీనంలోకి టీఎంసీ ప్రధాన కార్యాలయం
తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో అంతర్గత పోరు మరింత ముదిరింది. ప్రతిపక్ష నేత రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం శుక్రవారం కోల్కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది.
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో అంతర్గత పోరు మరింత ముదిరింది. ప్రతిపక్ష నేత రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం శుక్రవారం కోల్కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. పార్టీ పేరు, గుర్తు తమకే కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన మర్నాడే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ కార్యాలయం 2022 నుంచి పార్టీ ప్రధాన కార్యాచరణ కేంద్రంగా నడుస్తోంది.
శుక్రవారం సీనియర్ నేతలు ఫిర్హాద్ హకీమ్, జావేద్ ఖాన్, సందీపన్ సాహా, అఖ్రుజ్జమాన్లతో కలసి రితబ్రత బెనర్జీ ఈ కార్యాలయాన్ని సందర్శించారు. భవన యజమానులతో అవసరమైన ఒప్పందాలను పూర్తి చేశామని, ఇకపై తాము ఇక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తామని తిరుగుబాటు నేతలు స్పష్టం చేశారు. కాగా ఈ ముట్టడిని మమతా బెనర్జీ వర్గానికి చెందిన నేతలు మదన్ మిత్రా, కునాల్ ఘోష్ ఖండించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

