కోల్కతా: తన కారు ఆపినందుకు టోల్ బూత్ సిబ్బందిపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ దాడి చేశారు. అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆయన క్షమాపణలు చెప్పారు. పశ్చిమ బెంగాల్లోని బుర్ద్వాన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఎంసీకి చెందిన ఎంపీ సునీల్ మండల్ గురువారం రాత్రి కారులో ప్రయాణించారు. పల్సిట్ ప్రాంతంలోని టోల్ బూత్ వద్దకు ఆయన కారు చేరింది.
కాగా, వీఐపీ లైన్లో అడ్డుగా ట్రాఫిక్ కోన్లు ఉన్నాయి. అయినప్పటికీ డ్రైవర్ కారును ఆపలేదు. ట్రాఫిక్ కోన్ను ఢీకొట్టి ముందుకు నడిపాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న టోల్ బూత్ ఉద్యోగి ఉజ్వల్ సింగ్ ట్రాఫిక్ కోన్ను పక్కకు తీసేందుకు ప్రయత్నించాడు. ఇంతలో కారు దిగి వచ్చిన ఎంపీ సునీల్ మండల్ ఆ ఉద్యోగిపై మండిపడ్డారు. అతడిపై చేయి చేసుకుని తోసేశారు. కొందరు జోక్యం చేసుకోవడంతో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మరోవైపు, టోల్ బూత్ వద్ద ఉన్న సీసీటీవీలో ఇదంతా రికార్డ్ అయ్యింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో టీఎంసీ ఎంపీ సునీల్ మండల్ జరిగిన దానిపై వివరణ ఇచ్చారు. తాను తొందరలో వెళ్తుండగా ఈ సంఘటన జరిగిందని తెలిపారు. ట్రాఫిక్ కోన్ను తొలగించాలని తన సెక్యూరిటీ సిబ్బంది చెప్పినప్పటికీ టోల్ బూత్ ఉద్యోగి పట్టించుకోలేదని ఆరోపించారు. అలాగే అతడు తన పట్ల అమర్యాదగా ప్రవర్తించాడని దీంతో తాను చేయి చేసుకున్నట్లు చెప్పారు. అయితే ఆ ఉద్యోగిని భౌతికంగా తోయడం తప్పేనంటూ క్షమాపణలు కూడా చెప్పారు.
ये #MP #MLAs को समझना चाहिए कि टोल प्लाजा पर खडे सामान्य लोग उन्हें नहीं पहचानते. वो अपना काम कर रहे है. अगर गाडी रोक दी तो गुनाह नहीं कर दिया
जनाब पश्चिम बंगाल के बर्दवान पूर्व के #सांसद #sunilmandal है
हरकत तो दिख ही रही है https://t.co/w1sRx9QO3t pic.twitter.com/09EbhRDNDu
— Archana Pushpendra (@margam_a) August 4, 2023