కోల్‌కతా : ఇది పాకిస్థాన్‌పై మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ లేదా నామమాత్రపు బెదిరింపులు చేసే కాలం కాదని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ అన్నారు. అర్థమయ్యే భాషలోనే వారికి గుణపాఠం చెప్పవలసిన సమయమని చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీరును(పీవోకే) తిరిగి స్వాధీనం చేసుకోవలసిన సమయమని తెలిపారు. దృఢనిశ్చయంతో సమస్యను ఎదుర్కొనాలని అన్నారు. పహల్గాంలో ఉగ్రవాద దాడికి దారి తీసిన లోపాలపై కట్టుదిట్టంగా దర్యాప్తు చేయడానికి బదులుగా, ఓ రాజకీయ పార్టీకి లబ్ధి చేకూరే విధంగా ఓ కథనాన్ని ప్రజల ముందు పెట్టడంపైనే దృష్టి సారిస్తున్నారని ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన సందేశంలో ఆరోపించారు.