West Bengal | బీజేపీ గెలిస్తే మహిళలకు రూ.5 లక్షల ఉచిత వైద్యం.. మహిళలకు టీఎంసీ వెన్నుపోటు.. మోదీ ఆరోపణ
West Bengal : పశ్చిమ బెంగాల్‌లోని మహిళలకు మమతా బెనర్జీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు ప్రధాని మోదీ. కాంగ్రెస్‌తో కలిసి మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిందని మోదీ అన్నారు.
West Bengal : పశ్చిమ బెంగాల్‌లోని మహిళలకు మమతా బెనర్జీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు ప్రధాని మోదీ. కాంగ్రెస్‌తో కలిసి మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిందని మోదీ అన్నారు. బెంగాల్‌లోని బంకురలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. పశ్చిమ బెంగాల్ ప్రజలకు పలు హామీలు ఇచ్చారు.
‘‘పశ్చిమ బెంగాల్ మహిళలు తమకు 33 శాతం రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్నారు. 2029 నుంచి ఇది అమలులోకి రావాలని కోరుకున్నారు. నేను కూడా ఇందుకు ప్రయత్నించా. కానీ, టీఎంసీ మాత్రం దీన్ని వ్యతిరేకించింది. పార్లమెంట్లో ఏం జరిగిందో అందరూ చూశారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి మహిళలకు టీఎంసీ వెన్నుపోటు పొడిచింది. బెంగాల్ ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాకూడదని టీఎంసీ కోరుకుంటోంది. వారి మహా జంగిల్ రాజ్యాన్ని అడ్డుకుంటారనే మమతా బెనర్జీ పార్టీ ఇదంతా చేస్తోంది. ప్రజలు జంగిల్ రాజ్యాన్ని ఓడించాలి. గిరిజనుల అభ్యున్నతి కోసం బీజేపీ పని చేస్తోంది. తొలిసారి ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిన పార్టీ బీజేపీ. ఈ రోజు ప్రపంచం అంతా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గౌరవిస్తోంది. కానీ, రాష్ట్రపతిని టీఎంసీ ప్రభుత్వం అవమానించింది.
ద్రౌపది ముర్ము బెంగాల్ పర్యటనకు వచ్చినప్పుడు ఎలా అవమానించారో తెలుసు. ఈ చర్య ద్వారా గిరిజన తెగల్ని కూడా ఆ పార్టీ అగౌరవపరిచింది. టీఎంసీ నిత్యం గిరిజనుల్ని అవమానిస్తూనే ఉంది. రాష్ట్రపతిని అవమానించడాన్ని గిరిజనులు ఎప్పటికీ మర్చిపోరు. గిరిజనుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ కేటాయిస్తాం. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే పేద మహిళలకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తాం. ఉచితంగా డయాలసిస్ నిర్వహిస్తాం’’ అని మోదీ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాలో ఈ నెల 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Danger bells | తెలంగాణలో తరుముకొస్తున్న కరువు..! చుక్క నీరు లేక నెర్రెలు వాసిన ప్రాజెక్టులు, చెయ్యిచ్చిన కాంగ్రెస్ : వీడియో
Cult | ‘కల్ట్’ రిలీజ్ ట్రైలర్.. రక్తపాతం, భయంకరమైన హత్యలతో విశ్వక్ సేన్ విశ్వరూపం!
ISRO | మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. శుక్రవారం రాత్రి నింగిలోకి దూసుకెళ్లనున్న జీఎస్సెల్వీ-ఎఫ్18..!
Sri Venkateswara Creations | భారీ సాహసానికి పూనుకున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. ఒకేసారి నాలుగు క్రేజీ చిత్రాల డిస్ట్రిబ్యూషన్!
Jailer 2 | ‘జైలర్ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా .. నవంబర్ 12 నుంచే స్ట్రీమింగ్ అంటూ ప్రచారం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

