Tirupati Railway Station | హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ): తిరుపతి రేల్వే స్టేషన్లో పునరాభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) అధికారులు తెలిపారు. రైల్వే మంత్రిత్వశాఖ రూపొందించిన `రైల్వే స్టేషన్ల అప్గ్రెడేషన్` పనుల్లో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
గత ఏడాది మే 22న తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు ప్రారంభించామని ఎస్సీఆర్ అధికారులు చెప్పారు. 2025 నాటికి తిరుపతి రైల్వే స్టేషన్ అప్గ్రెడేషన్ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, సకల సౌకర్యాలతో తిరుపతి రైల్వే స్టేషన్ను పునర్నిర్మిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.