జైపూర్: గ్రామంలో సంచరిస్తున్న పులి మనుషులపై దాడి చేస్తున్నది. ఈ విషయం తెలిసిన అటవీశాఖ సిబ్బంది పలు వాహనాల్లో ఆ గ్రామానికి చేరుకున్నారు. పులిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే రెస్క్యూ వాహనంపై దాడికి పులి యత్నించింది. దానిపైకి జంప్ చేసింది. (Tiger Jumps On Rescue Vehicle) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సుమారు 42 పులులున్న సరిస్కా టైగర్ రిజర్వ్ నుంచి మూడు పులులు తప్పించుకున్నాయి. ఆ అటవీ ప్రాంతం సమీపంలోని గ్రామాల్లో అవి సంచరిస్తున్నాయి. పొలంలో పని చేస్తున్న మహిళతో సహా ముగ్గురు వ్యక్తులపై ఒక పులి దాడి చేసింది. వారిని జైపూర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, పులి సంచారం, దాడి గురించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో పలు వాహనాల్లో ఆ గ్రామానికి చేరుకున్నారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పులిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా రెస్క్యూ వాహనంపై పులి దాడి చేసింది. దానిపైకి జంప్ చేసేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత పులి అక్కడి నుంచి పొదల్లోకి పారిపోయింది.
మరోవైపు వారం కిందట సరిస్కా టైగర్ రిజర్వ్ నుంచి తప్పించుకున్న పులి నంబర్ 2402ను పట్టుకుని కాపాడేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అక్కడి నుంచి తప్పించుకున్న మరో రెండు పులులు జైపూర్ పరిధిలోని జామ్వా రామ్‌గఢ్ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే రెస్క్యూ వాహనంపై పులి దాడికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Tiger enters Village – rescue ops on by @ForestRajasthan – The tiger tried attacking the Forest dept car – watch #Alwar #sariska pic.twitter.com/2OqA8MebTl
— Utkarsh Singh (@utkarshs88) January 2, 2025