శ్రీనగర్: ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు గుర్తు తెలియని మిలిటెంట్లు హతమయ్యారు(Militants Killed). పట్టాన్ ఏరియాలో భద్రతా దళాలు ఎన్కౌంటర్ చేపట్టాయి. ఆర్మీ, పారామిలిటరీ సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆ ఆపరేషన్ నిర్వహించాయి. పట్టాన్లోని చాక్ తప్పర్ గ్రామంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో భద్రతా దళాలు ఎన్కౌంటర్లో పాల్గొన్నాయి. స్కూల్ బిల్డింగ్లో దాక్కున్న మిలిటెంట్లతో ఎదురుకాల్పులకు దిగారు. శుక్రవారం రాత్రి ఒక మిలిటెంట్ చనిపోగా, శనివారం ఉదయం మరో ఇద్దరు హతమయ్యారు.
ఎన్కౌంటర్లో ముగ్గురు చనిపోయినట్లు కశ్మీర్ ఐజీ వీకే బిర్డి వెల్లడించారు. ఆ మిలిటెంట్లను గుర్తించే ప్రక్రియలో ఉన్నట్లు చెప్పారు. మరోవైపు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ దోడా జిల్లాలో ప్రధాని మోదీ ప్రచారం చేపట్టనున్నారు.