పాట్నా : బీహార్ రాజధాని పాట్నాకు సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బేరూ మోర్ వద్ద పోలీసుల పెట్రోలింగ్ వాహనాన్ని.. అతి వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. దీంతో పెట్రోలింగ్ వాహనంలో ఉన్న ముగ్గురు పోలీసులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించినట్లు ట్రైనీ డీఎస్పీ ప్రంజల్ త్రిపాఠి పేర్కొన్నారు.