భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో ఐదు గంటలపాటు సాగిన ఆపరేషన్‌లో ఓ మహిళతో సహా ముగ్గురు మావోయిస్టులు మరణించారు. లంజీ హెడ్‌క్వార్టర్స్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహేలా పోలీస్‌స్టేషన్ పరిధిలోని కడ్లా గ్రామంలో ఎన్కౌంటర్ జరిగింది. మృతులు నగేశ్, మనోజ్, రమేగా గుర్తించారు. వీరిలో నగేశ్ డివిజన్ కమిటీ సభ్యుడు కాగా, మనోజ్ ఏరియా కమిటీ సభ్యుడని పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌ను మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా ధ్రువీకరించారు.
నగేశ్‌పై రూ.15లక్షల రివార్డ్, మనోజ్, రమేపై రూ.8లక్షల రివార్డ్ ఉందని తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఏకే47, ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలకు సంబంధించి తమకు నిర్దిష్ఠ సమాచారం ఉందని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. లొంగిపోవాలని కోరినా వినలేదని, పోలీస్ బృందంపై కాల్పులు ప్రారంభించారన్నారు.