Maoists | రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో తుపాకులు గర్జించాయి. చింద్ఖేడ్ అటవీ ప్రాంతంలో తూటాల వర్షం కురిసింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు సంభవించాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎదురుకాల్పులు కాంకేర్ ఎస్పీ కల్యాణ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ జరిగింది. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.