న్యూఢిల్లీ: అమెరికా వైమానిక దాడిలో భారత్‌కు చెందిన ముగ్గురు నావికులు(Indian Sailors) మృతిచెందారు. వాస్తవానికి గత వారం జరిగిన ఆ ఘటనలో ఆ నావికులు మిస్సైనట్లు భావించారు. కానీ ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ఆ ముగ్గురు నౌకాదళ సిబ్బంది మృతిచెందినట్లు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. ఎంటీ సిట్టిబెల్లో అనే నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉన్నారు. దీంట్లో 24 మంది భారతీయులే. విదేశీయుల్లో ఇద్దరు పాకిస్తానీలు, ఒకరు ఉక్రెయిన్ , రష్యా వ్యక్తి ఉన్నారు.
గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఆ నౌకపై అమెరికా దాడి చేసింది. మృతిచెందిన వారిని డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ , ఇంజిన్ ఫిట్టర్ శివానంద చౌరాసియా, చీఫ్ ఇంజినీర్ పట్నాలా సురేశ్‌గా గుర్తించారు. ఒమన్ తీరంలో వెళ్తున్న నౌకపై ప్రిసిషన్ మునిషన్ బాంబులతో సెంట్రల్ కమాండ్ దళాలు అటాక్ చేశాయి. ఇరాన్ సంక్షోభ వేళ ఆ నౌక ఆదేశాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అయితే ఐక్యరాజ్యసమితి వేదికగా ఆ దాడిని ఇండియా ఖండించింది. 24 మంది భారతీయులున్న నౌకపై అమెరికా నేవీ దాడి చేసిందన్నారు. హోర్ముజ్‌ను క్రాస్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు. ఇరాన్ నుంచి ఇంధనం తీసుకెళ్తున్న వాణిజ్య నౌకపై తమ యుద్ధవిమానాలు దాడి చేసినట్లు సెంట్రల్ కమాండ్ చెప్పింది. ఆ ప్రమాదం ముగ్గురు నావికులు మృతిచెందడం దురదృష్టకరమని మంత్రి సోనోవాల్ తెలిపారు. తొలుత మిస్సైనట్లు భావించిన వారి దేహాలను గుర్తించినట్లు వెల్లడించారు. నౌకాదళ సిబ్బందికి ఇది తీరని లోటు అన్నారు. వారి కుటుంబసభ్యులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
It is deeply unfortunate to learn of the tragic incident aboard the Palau-flagged MT Settebello. Sadly, three Indian seafarers initially reported missing are now confirmed dead after bodies have been located and identified.
This is a profound loss to our maritime family. The…
— Sarbananda Sonowal (@sarbanandsonwal) June 11, 2026