Wayanad : కేరళలోని వయనాడ్ జిల్లాలో దారుణ ప్రమాదం జరిగింది. టన్నెల్ వద్ద కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు మరణించారు. మట్టిదిబ్బల కింద మరికొందరు చిక్కుకున్నారు. ఈ ఘటన కేరళలోని వయనాడ్ జిల్లా, మెప్పాడి సమీపంలోని కల్లాడి వద్ద మంగళవారం జరిగింది. స్థానిక మీనాక్షి బ్రిడ్జి వద్ద ఒక టన్నెల్ కోసం తవ్కాలు, నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఆ మట్టిదిబ్బలు, రాళ్ల కింద పలువురు చిక్కుకుపోయారు. వీరిలో ముగ్గురు మరణించారు. ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్, రెస్క్యూ బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించాయి.
శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనపై కేరళ సీఎం వీడీ సతీషన్ కూడా స్పందించారు. వయనాడ్ జిల్లా అధికారులతో మాట్లాడారు. తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించి బాధితుల్ని కాపాడాలని, వ్యవస్థల్ని సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. సహాయక చర్యల్ని పర్యవేక్షించాల్సిందిగా మంత్రులు ఏపీ అనిల్ కుమార్, టీ సిద్దిఖ్లను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ఇక్కడ టన్నెల్ నిర్మాణ పనుల్ని సోమవారం నుంచే నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో గడిచిన 24 గంటల్లో 265 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగానే ఈ కొండచరియలు విరిగిపడి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఘటనా స్థలం వద్ద ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్స్ రాకముందే స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
ఆరుగురిని రక్షించారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మిగిలిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం వల్ల పలు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల స్తానికంగా నివసించే వారి భద్రత విషయంలో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇండ్లకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులతోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొ్ంటున్నాయి.
🚨 WAYNAD LANDSLIDE UPDATE
1 Dead, 7 Injured, 7 Missing in Rain-Triggered Landslide at Wayanad-Kalladi Tunnel Site https://t.co/XptbhxH5ef pic.twitter.com/w6ifjJyAbj
— Public News X (@PublicNewsX) July 7, 2026