జైపూర్: బీజేపీ అహంకారంపై ఆర్ఎస్ఎస్ నాయకుడు మండిపడ్డారు. (RSS leader’s dig at BJP) అందుకే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీని 241 సీట్ల వద్ద రాముడు నిలిపినట్లు అన్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్ సమీపంలోని కనోటాలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేష్ కుమార్ మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీ పేలవమైన పనితీరును విమర్శించారు. అహంకారమే దీనికి కారణమని దుయ్యబట్టారు. ‘రాముడిపై భక్తిని ప్రదర్శించి, అహంకారంతో ఉన్న పార్టీని 241 వద్ద రాముడు నిలిపివేశాడు. అయితే అది అతిపెద్ద పార్టీగా అవతరించింది’ అని అన్నారు.
మరోవైపు ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్‌ను కూడా ఇంద్రేష్ కుమార్ లక్ష్యంగా చేసుకున్నారు. వారు రాముడికి వ్యతిరేకమని విమర్శించారు. రాముడ్ని వ్యతిరేకించిన వారిలో ఎవరికీ అధికారం దక్కలేదని తెలిపారు. వారందరినీ (భారత కూటమి) కలిపి నంబర్ టూగా రాముడు ఉంచాడని అన్నారు. ‘రాముడిపై విశ్వాసం లేని వారిని ఏకంగా 234 వద్ద ఆయన నిలిపివేశారు. దేవుడి న్యాయం నిజం, ఆనందదాయకం’ అని వ్యాఖ్యానించారు.
'जो अहंकारी बन गए उन्हें 241 पर रोक दिया'
◆ RSS नेता इंद्रेश कुमार का बड़ा बयान #RSS #IndreshKumar | RSS Leader Indresh Kumar pic.twitter.com/ih61beTokG
— News24 (@news24tvchannel) June 14, 2024