దాహోద్ : గుజరాత్‌లోని దాహోద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ(PM Modi) మాట్లాడారు. భారత్‌ను ద్వేషించడమే పాకిస్థాన్ లక్ష్యమని, మన దేశానికి చేయాలన్న ఉద్దేశంతో ఆ దేశం ఉందని, కానీ మనం మాత్రం పేదరిక నిర్మూలన, ఆర్థిక ప్రగతి లాంటి అంశాలను టార్గెట్‌గా పెట్టుకున్నట్లు చెప్పారు. ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావిస్తూ.. మన సోదరీమణుల సింధూరాన్ని తొలగిస్తే, ఉగ్రవాదుల అంతం దగ్గరపడినట్లే అని పేర్కొన్నారు. వడోదరలో జరిగిన రోడ్ షోలో వేల సంఖ్య తల్లులు, అక్కాచెల్లెళ్లు ఆ ఈవెంట్ లో పాల్గొన్నట్లు చెప్పారు. భారతీయ సాయుధ బలగాలు సాధించిన విజయాన్ని వాళ్లు ఎంజాయ్ చేశారన్నారు. తిరంగ ర్యాలీ చేపడుతూ.. ఆపరేషన్ సిందూర్ కు దీవెనల ఇస్తున్నట్లు చెప్పారు.
VIDEO | Dahod, Gujarat: After inaugurating and laying foundation stone of various development projects, Prime Minister Narendra Modi (@narendramodi) says, “I was in Vadodara before coming here, thousands of mothers and sisters had come, they had come to celebrate the Indian armed… pic.twitter.com/QlWaxGPMBG
— Press Trust of India (@PTI_News) May 26, 2025
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసు కదా అని, భారత్ కానీ మోదీ కానీ సైలెంట్‌గా కూర్చుకుంటారని అడిగారు. ఒకవేళ ఎవరైనా ఆడవాళ్ల సింధూరాన్ని లాక్కెళ్లాలని చూస్తే, వాళ్లను అంతం చేయడమే తమకు ముఖ్యం అవుతుందన్నారు. ఆపరేషన్ సింధూర్ అనేక కేవలం మిలిటరీ చర్య మాత్రంక కాదు అని, కానీ అది భావోద్వేగాలకు చెందిన అంశమన్నారు. మోదీతో పెట్టుకోవద్దు అన్న విషయంలో ఉగ్రవాదులు కలలో కూడా ఉహించి ఉండరన్నారు. పెహల్గామ్ దాడి ఘటన ఫోటోలను చూస్తుంటే రక్తం మరుగుతోందన్నారు.