న్యూఢిల్లీ : ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే ఫోన్ సంభాషణను రహస్యంగా వినేందుకు సైంటిస్టులు సరికొత్త టెక్నాలజీ అభివృద్ధి చేశారు. రాడార్ కిరణాలు, కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీతో 10 అడుగుల దూరం నుంచి ఫోన్ సంభాషణను ట్రాక్ చేయవచ్చునని ‘పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ’ సైంటిస్టులు చెబుతున్నారు.
మనం మాట్లాడే ఫోన్ ఇయర్పీస్ నుంచి వచ్చే శబ్ధ తరంగాల్ని రాడార్ కిరణాలతో గ్రహించి, వాటిని ఏఐ టెక్నాలజీతో తిరిగి సంభాషణల రూపంలో మార్చుతారు.హ్యాకింగ్, స్పేవేర్.. మరిచిపోయే రోజు వస్తుందని, రాడార్ కిరణాలు, ఏఐ టెక్నాలజీతో ఫోన్లను ట్యాప్ చేయవచ్చునని వారి అధ్యయనం నిరూపించింది. సెల్ఫ్-డ్రైవింగ్ కార్లు, 5-జీ టెక్నాలజీలో ఈ టెక్నాలజీ ఇప్పటికే వాడుతున్నారని సైంటిస్టులు గుర్తుచేశారు.