న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్ సూట్ ఇదేనంటూ కంటెంట్ క్రియేటర్, బాలీవుడ్ నటి అనన్యా పాండే కజిన్ అలన పాండే ఓ వీడియోను (Viral Video) షేర్ చేశారు. దుబాయ్‌లోని అట్లాంటిస్ ది రాయల్ హోటల్లో కొలువుదీరిన అద్భుతమైన రూం టూర్‌ను ఇన్స్టాగ్రాం రీల్లో అలన ప్రదర్శించింది. ఈ లగ్జరీ ప్రాపర్టీ రూమ్స్, పూల్ డెక్, ఆఫీస్, లైబ్రరీ, కాన్ఫరెన్స్ రూమ్‌లను ఈ వీడియోలో చూపించింది.
ఈ అల్ట్రా లగ్జరీ ఎక్స్పరిమెంటల్ రిసార్ట్‌లో ఓ రాత్రి గడపాలంటే రూ. 83 లక్షలు చెల్లించాలి. ఈ అల్ట్రా మోడరన్ టూ లెవెల్ ఫోర్ బెడ్రూం పెంట్‌హౌస్ ది రాయల్ మ్యాన్షన్‌లో 12 సీట్ల డైనింగ్ రూం, ఎంటర్టైన్మెంట్ రూం, స్విమ్మింగ్ పూల్, దుబాయ్ ఆకాశహార్మ్యాలకు పోటీ పడే ఎత్తులో ప్రైవేట్ టెర్రెస్‌లు అలరిస్తాయి.
అత్యంత ఖరీదైన లగ్జరీ సూట్లో 4 బెడ్రూంలు, 4 బాత్రూంలు, స్టీమ్ రూమ్‌లతో 4 బాత్రూంలు, ఇండోర్, అవుట్డోర్ కిచెన్స్, మూవీ థియేటర్, ఆఫీస్, లైబ్రరీ, ప్రైవేట్ బార్ వంటి సౌకర్యాలతో విలాసవంతమైన విడిదిని అందిస్తాయని వీడియోను షేర్ చేస్తూ పాండే రాసుకొచ్చింది.
Read More :
Priyank Kharge | 8 ఏండ్లలో 5గురు సీఎంలను మార్చిన చరిత్ర బీజేపీది : ప్రియాంక్ ఖర్గే