Jiah Khan | నా బిడ్డది హత్య.. నేను హైకోర్టుకు వెళ్తా: జియాఖాన్ తల్లి రబియా
Jiah Khan | నటి జియాఖాన్ (Jiah Khan) ను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో నిందితుడిగా ఉన్న సూరజ్ పంచోలీ (Suraj Pancholi) ని ఇవాళ ముంబైలోని సీబీఐ స్పెషల్ కోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై జియా తల్లి రబియాఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.
ముంబై: నటి జియాఖాన్ (Jiah Khan) ను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో నిందితుడిగా ఉన్న సూరజ్ పంచోలీ (Suraj Pancholi) ని ఇవాళ ముంబైలోని సీబీఐ స్పెషల్ కోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై జియా తల్లి రబియాఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. నా బిడ్డ ఆత్మహత్య కాదని, హత్య చేశారని, దీనిపై తాను మరోసారి హైకోర్టుకు వెళ్తానని ఆమె చెప్పారు.
జియాఖాన్ 2013 జూన్ 3న ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె గదిలో దొరికిన సూసైడ్ నోట్ ఆధారంగా సూరజ్ పంచోలీ ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు భావించి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేయడం, జియా తల్లి రబియా మాత్రం తనబిడ్డది ఆత్మహత్య అని వాదించడం కేసు విచారణలో తీవ్ర జాప్యం జరిగింది.
2019లో ఈ కేసు విచారణ ప్రారంభం కాగా.. పరిమిత సాక్ష్యాధారాల కారణంగా సూరజ్‌ను దోషిగా పేర్కొనలేమని, నిర్దోషిగా ప్రకటిస్తున్నామని కోర్టు పేర్కొంది. సూరజ్ పంచోలీ తన బిడ్డను ఆత్మహత్యకు ప్రేరేపించలేదని కోర్టు తేల్చిందని, మరైతే నా బిడ్డ ఎలా చనిపోయిందని ఆమె ప్రశ్నిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

