గణేశ్‌పూర్, జనవరి 23: అది మహారాష్ట్రలోని వాసిం జిల్లా గణేశ్‌పూర్ అనే చిన్న గ్రామం. ఆ ఊరి జనాభా 150 మంది. అక్కడ ప్రభుత్వ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల కూడా ఉంది. అయితే చిత్రమేమిటంటే ఆ స్కూల్‌కి ఒకే టీచర్, ఒకే విద్యార్థి.
అక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి బైక్‌పై ఠంచన్‌గా విధులకు హాజరయ్యే టీచర్ కిషోర్ మన్కర్ ఆ విద్యార్థికి శ్రద్ధగా అన్ని సబ్జెక్టులు బోధిస్తారు. గత రెండేళ్లుగా ఒక టీచర్.. ఒకరే విద్యార్థితో పాఠశాల నడుస్తున్నదని స్థానికులు చెప్పారు.