తిరుమల: తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి కల్పవృక్ష వాహనంపై కొలువుదీరారు. తిరు వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీదేవి, భూదేవి సమేతంగా కల్పవృక్ష వాహనంపై ఊరేగుతున్న స్వామి వారి వైభవాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ రాత్రి సర్వభూపాల వాహన సేవ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని తిరుమల దేవస్థాన కమిటీ వెల్లడించింది.