హమీర్పూర్, సెప్టెంబర్ 7: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఘోరం జరిగింది. ఉచిత సేవలు అందించాల్సిన ప్రభుత్వ అంబులెన్స్ డ్రైవర్.. రూ.వెయ్యి లంచం ఇస్తే కానీ దవాఖానకు తీసుకుపోనంటూ నిండు గర్భవతిని నడి రోడ్డుపై వదిలి వెళ్లాడు. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లా పండారీ గ్రామంలో చోటుచేసుకున్నది. గర్భవతి కుటుంబసభ్యుల వద్ద రూ.1000 కూడా లేకపోవడంతో అతడికి ఆ డబ్బు ఇవ్వలేకపోవడంతో డ్రైవర్ తిరిగి వెళ్లిపోయాడు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.