డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన ఒలింపిక్ క్రీడాకారుడు సురాజ్ పన్వర్ తల్లి పూనమ్‌ను హిప్నటైజ్ చేసి, రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం, ఆమె బుధవారం ఉదయం తన ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్తుండగా ఓ వ్యక్తి ఆమెతో మాటలు కలిపాడు. కొంత దూరం తర్వాత మరొకరు వారికి తోడయ్యాడు.
తనకు క్షుద్ర శక్తులపై పట్టు ఉందని, ఆమెను ఓ చెట్టు కిందకు తీసుకెళ్లారు. కొన్ని మంత్రాలను పఠించి, దుండగులిద్దరూ ఆమె పర్సులోని రూ.1,100 నగదు, ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పూనమ్ పోలీసులను ఆశ్రయించారు. చెప్పినట్టు చేయకపోతే ఇంటికి నిప్పంటిస్తామని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.