Home
National
They Bjp Kept Calling Them Ncp Leaders Corrupts And Now They Have Taken Them Into Their Government Mehbooba Mufti
Mehbooba Mufti | అక్రమార్కులన్నారు, అంటకాగారు.. బీజేపీ అవినీతి పార్టీ అనడానికి ఇదే నిదర్శనం: మెహబూబా ముఫ్తీ
Mehbooba Mufti | మహారాష్ట్రలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ స్పందించారు.
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ స్పందించారు. బీజేపీ నేతలు ఇన్నాళ్లు ఎవరినైతే అక్రమార్కులు, అవినీతిపరులు అని నిందించారో ఇప్పుడు వాళ్లతోనే (ఎన్సీపీ నేతలు) కుమ్మక్కయ్యారని ఆమె విమర్శించారు.
‘వాళ్లు (బీజేపీ నేతలు) వాళ్లని (ఎన్సీపీ నేతలను) ఎప్పుడూ అవినీతిపరులని, అక్రమార్కులని నిందించేవారు. ఆ అక్రమార్కులనే ఇప్పుడు ఏకంగా మహారాష్ట్ర సర్కారులో చేర్చుకున్నారు. బీజేపీ అత్యంత అవినీతి పార్టీ అనడానికి ఇదే నిదర్శనం. దేశంలో ప్రతిపక్షాలు లేకుండా చేయడం కోసం బీజేపీ.. ఈడీ, సీబీఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారాలను దుర్వినియోగం చేస్తున్నది’ అని మండిపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

