CJ BR Gavai | ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమిలేయర్ ఉండాలి : సీజే బీఆర్ గవాయ్
CJ BR Gavai | భారత రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్లు విజయవంతంగా పూర్తయ్యాయని,ఈ కాలంలో అనేక సవరణలు, రిజర్వేషన్లను రాజ్యాంగం అవకాశం కల్పించిందిందని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు.
అమరావతి : భారత రాజ్యాంగం( Indian Constitution) ఏర్పడి 75 ఏళ్లు విజయవంతంగా పూర్తయ్యాయని,ఈ కాలంలో అనేక సవరణలు, రిజర్వేషన్లను (Reservation) రాజ్యాంగం అవకాశం కల్పించిందిందని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్(CJ BR Gavai) అన్నారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లోనూ చట్టం చేశారని, ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమిలేయర్ ( Creamylayer) ఉండాలనేది తన అభిప్రాయమని పేర్కొన్నారు.
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సీకే కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన పాల్గొని ‘ ఇండియా అండ్ ది లివింగ్ ఇండియన్ ఇన్స్స్టిట్యూషన్ ఎట్ 75 ఇయర్స్’ అనే అంశంపై ప్రసంగించారు జస్టిస్ గవాయ్ మాట్లాడారు. రాజ్యాంగం గొప్పదనం గురించి మాట్లాడే అవకాశం తనకు రావడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు.
మహిళలపై అసమానత రూపుమాపేందుకు జ్యోతి రావ్ ఫులే ఎంతో కృషి చేశారని, పని ప్రదేశాల్లో మహిళలపై వివక్ష ఉండకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మహిళలకు సమానత్వం ఉండాలనేది సుప్రీంకోర్టు విధానం. న్యాయ రంగంలో మహిళలు రాణిస్తుండడం అభినందనీయమని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకిచ్చారని అన్నారు. ఓ ఛాయ్ వాలా మోదీ దేశానికి ప్రధాని కాగలిగారని తెలిపారు.
రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో నిఫుణులను అందించే సత్తా భారత్కు వస్తుందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగిందని వెల్లడించారు. వ్యవస్థలోని లోపాను సరిదిద్ది న్యాయవ్యవస్థ కీలక బాధ్యత వహిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్, హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు .
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

