న్యూఢిల్లీ, జూన్ 13: సీయూఈటీ నార్మలైజేషన్తో పాటు ఒకే పరీక్షను ఎక్కువ తేదీల్లో నిర్వహించడంపై ఎన్టీయే స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. తురా(మేఘాలయ)లో శాంతిభద్రతల సమస్యతో పాటు కొన్ని దేశాల్లో సెక్యూరిటీ ఇబ్బందులు రావడం వల్ల 565 మంది స్టూడెంట్లు తమకు సంబంధించిన 28 సబ్జెక్టులను మార్చిలో వారికి షెడ్యూల్ చేసిన సమయంలో రాయలేకపోయారని తెలిపింది. కేవలం వారికి మాత్రమే ఎగ్జామ్ను మార్చి 29, 30 తేదీల్లో రీ షెడ్యూల్ చేశామని స్పష్టం చేసింది. వారి నియంత్రణలో లేని పరిస్థితుల కారణంగా అభ్యర్థులు నిరాశ చెందొద్దు అనే ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నట్టు ఎన్టీయే వెల్లడించింది.