నేరస్తులకు టికెట్లు ఇచ్చేందుకు ఎస్పీ, బీఎస్పీ మధ్య పోటీ:యోగి ఆదిత్యనాథ్

లక్నో: నేరస్తులకు టికెట్లు ఇచ్చేందుకు ఎస్పీ, బీఎస్పీ మధ్య పోటీ నెలకొందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. ఈ నేరగాళ్లు ఎమ్మెల్యేలైతే తుపాకులు ఉత్పత్తి చేస్తారని ఆరోపించారు. వారికి చికిత్స చేయడానికి ఒకే ఒక మార్గం.. జేసీబీ, బుల్డోజర్ అని అన్నారు. బాగ్పత్లో ఎన్నికల ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎస్పీపై మండిపడ్డారు. ముజఫర్నగర్ అల్లర్లలో 60 మందికి పైగా హిందువులు హత్యకుగురయ్యారని, 1500 మందికి పైగా హిందువులను కటకటాల వెనుక ఉంచారని అన్నారు. ఇది సమాజ్వాదీ పార్టీ గుర్తింపు అని, పార్టీ టోపీని అమాయక రామభక్తుల రక్తంతో పెయింట్ చేశారని విమర్శించారు.
ఉత్తరప్రదేశ్లో 2017కు ముందు లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది? అని యోగి ఆదిత్యనాథ్ ప్రశ్నించారు. మహిళల భద్రత ప్రమాదంలో పడిందన్నారు. ఎంతగా అంటే బాలికలు పాఠశాలలకు వెళ్లలేనంతగా అని విమర్శించారు. అబ్బాయిలు తప్పులు చేస్తారంటూ ములాయం సింగ్ జీ సమర్థించేవారని గుర్తు చేశారు. మహిళలు, యువతపై ఆ పార్టీకి ఎలాంటి సానుభూతి లేదన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

