శ్రీనగర్, సెప్టెంబర్ 17: ప్రమాదవశాత్తు తుపాకీ పేలి ఓ ఆర్మీ జవాన్ మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. జమ్ముకశ్మీర్‌లోని బందిపొర జిల్లాలో ఆదివారం ఈ ప్రమా దం జరిగింది.
జవాన్లు శిబిరంలో ఉండగా ప్రమాదవశాత్తు ఓ ఆయుధం నుంచి తూటా వెలువడి ఒక జవాన్ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు గాయపడినట్టు బందిపొర పోలీసులు తెలిపారు. దీనికి కారకుడైన ఆర్మీ జవాన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు వారు చెప్పారు.