న్యూఢిల్లీ: భారత్లో నిఫా వైరస్ తాజా విజృంభణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రజలకు భరోసా ఇచ్చింది. నిఫా వైరస్ వ్యాప్తి ముప్పు చాలా స్వల్పంగా ఉందని, పశ్చిమ బెంగాల్లో రెండు కేసులు నిర్ధారణ అయిన నేపథ్యంలో ప్రయాణ లేదా వాణిజ్య ఆంక్షలను విధించాల్సిన అవసరం లేదని సంస్థ తెలిపింది.
గతంలో కూడా నిఫా వైరస్ బయటపడిన ఉత్తర 24 పరగణాల జిల్లాలోనే తాజా వైరస్ కేసులు వెలుగుచూశాయి.