అయోధ్య: అయోధ్య, పంచకోశి పరిక్రమ మార్గాల్లో మాంసాహారంపై నిషేధం విధించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. స్థానికంగా మత, సంస్కృతి పరమైన పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
ఈ నిషేధం మాంసం దుకాణాలు, హోటళ్లు, వసతి గృహాలు, హోం స్టేలతో పాటు ఆన్లైన్ ఆర్డర్లకు వర్తిస్తుంది. వసతి గృహాలు, హోం స్టేలలో మాంసాహార వడ్డనపైనా నిషేధం ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిషేధ ఉత్తర్వుల అమలును నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపింది.