న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: ఇటీవల జోర్డాన్‌లోని తన సైనిక స్థావరంపై జరిగిన దాడికి అమెరికా ప్రతీకార దాడులు చేపట్టింది. ఇరాక్, సిరియాలోని 85 లక్ష్యాలపై డ్రోన్లు, వైమానిక బాంబు దాడులతో విరుచుకుపడింది. ఇరాన్ మద్దతు గల మిలిటెంట్లు, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ స్థావరాలపై దాడులు చేసింది.
దాడుల్లో దాదాపు 40 మంది మరణించినట్టు తెలుస్తున్నది. అమెరికన్లకు హాని కలిగిస్తే మాత్రం ప్రతి చర్య ఇలాగే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు.