న్యూఢిల్లీ: అమెరికాకు వెళ్లేవారి ఎలక్ట్రానిక్ డివైస్‌లను తనిఖీ చేసే అధికారం ఆ దేశ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ)కి ఉంది. అమెరికాలో ప్రవేశించేవారి వద్ద ఉన్న స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తనిఖీ చేసే చట్టబద్ధ అధికారం సీబీపీ అధికారులకు ఉంది. ప్రయాణికుల పౌరసత్వం, వీసా స్టేటస్ వంటి వాటితో సంబంధం లేకుండా తనిఖీ చేస్తారు.
బేసిక్ సెర్చ్, అడ్వాన్స్డ్ సెర్చ్ అనే రెండు విధాలుగా ఎలక్ట్రానిక్ డివైస్ల తనిఖీలు జరుగుతాయి. బేసిక్ సెర్చ్‌లో సీబీపీ ఆఫీసర్ డివైస్‌ను తనిఖీచేస్తారు. అన్‌లాక్ అయి ఉన్నా, ప్రయాణికుడు పాస్‌వర్డ్‌ను ఇచ్చినా సరిపోతుంది. అడ్వాన్స్డ్ సెర్చ్‌లో, డివైస్‌లో డాటాను ఎక్స్టర్నల్ టూల్స్‌తో యాక్సెస్, కాపీ, అనలైజ్ చేస్తారు.
గ్రీన్‌కార్డ్ హోల్డర్స్: రెసిడెన్సీ స్టేటస్‌పై ప్రభావం పడటానికి ముందు గ్రీన్‌కార్డ్ హోల్డర్ వాదనను అధికారులు వినాలి. ఇది గ్రీన్ కార్డ్ హోల్డర్ల హక్కు.
వీసా హోల్డర్స్: ఎలక్ట్రానిక్ డివైస్‌లను అన్‌లాక్ చేయడానికి తిరస్కరించే వీసా హోల్డర్స్‌కు అమెరికా ప్రవేశాన్ని నిరాకరించవచ్చు. నిపుణుల సలహా ఏమిటంటే, మీ పాస్‌వర్డ్‌ను అధికారులకు చెప్పడానికి బదులుగా, మీరే ఎంటర్ చేయండి, ఆ తర్వాత దానిని మార్చుకోండి. డాటాను కాపాడుకోవడం ఎలా?
ట్రావెల్ లైట్: తక్కువ వ్యక్తిగత డాటాతో వేరుగా ఓ ట్రావెల్ డివైస్‌ను ఉపయోగించాలి. యాప్స్ నుంచి సైన్ ఔట్ అవాలి. ఆటో-లాగిన్స్‌ను డిజేబుల్ చేయాలి.
బ్యాకప్: ముఖ్యమైన ఫైల్స్‌ను క్లౌడ్ సర్వీసులో లేదా ఎక్స్టర్నల్ డ్రైవ్‌లో సేవ్ చేయాలి. సీబీపీ.. డివైస్‌లో ఫిజికల్‌గా ఉన్న వాటినే సోదా చేయగలదు. క్లౌడ్‌లో స్టోర్ చేసిన డాటాను యాక్సెస్ చేయలేరు.