FM Radio | న్యూఢిల్లీ, మే 7: మొబైల్ ఫోన్లలో ఎఫ్ఎం రేడియో సౌకర్యాన్ని తప్పనిసరి చేయాలని కేంద్ర ఐటీ శాఖ తయారీదారులకు సూచించింది. ఇలా చేయడం వల్ల అత్యవసర పరిస్థితులు, విపత్తుల్లో ప్రభుత్వం అందించే సమాచారం ప్రజలకు సులువుగా చేరుతుందని వివరించింది.
ఈ మేరకు ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్, మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎమ్ఏఐటీ)లకు కేంద్రం సూచనలు జారీ చేసింది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో రేడియోలు కొనుక్కోలేని వారికి సైతం సమాచారం అందించేందుకు రేడియో సేవలున్న స్మార్ట్ ఫోన్లు ఉపయోగడపతాయని కేంద్రం అభిప్రాయపడింది. ఎఫ్ఎం సేవలు దేశంలో డిజిటల్ వారధి నిర్మించేందుకు సహకరిస్తాయని తెలిపింది. విపత్తుల సమయంలో ఎఫ్ఎం రేడియో అందించే సమాచారం వల్ల విలువైన ప్రాణాలను రక్షించవచ్చని చెప్పింది.