Adil | న్యూఢిల్లీ : వారిద్దరి పేర్లు ‘ఆదిల్’యే. అయితే ఒకరు మతం పేరుతో మారణకాండకు దిగగా, మరొకరు మతం కన్నా మానవత్వం ముఖ్యమని చాటారు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందగా, అందులో గుర్రాలు నడిపించే సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కూడా ఉన్నాడు. అలాగే కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదుల్లో లష్కరే తాయిబాకు చెందిన ఆదిల్ థోకర్ అలియాస్ ఆదిల్ గురెస్ కూడా ఉన్నాడు. బిజ్బెహారాలోని గురీ గ్రామానికి చెందిన ఆదిల్ థోకర్ ఉగ్రవాదం వైపు అడుగులేసి తుపాకీ చేతపట్టాడు. మరోవైపు, ఆదిల్ హుస్సేన్ పహల్గాం దాడి సమయంలో ముష్కరులకు ఎదురెళ్లి పర్యాటకులను రక్షించే ప్రయత్నం చేశాడు.