న్యూఢిల్లీ: పార్లమెంట్ లేదా అసెంబ్లీల్లో మాట్లాడేందుకు, ఓటు వేసేందుకు లంచం తీసుకున్నవారికి విచారణ నుంచి మినహాయింపు ఇస్తూ గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఏడుగురు జడ్జీలతో ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది. పార్లమెంట్ సభ్యులకు విచారణ నుంచి మినహాయింపు పొందే హక్కును రాజ్యాంగం కల్పించిందని 1998 నాటి కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
ఈ తీర్పును పునః పరిశీలిస్తామని తాజాగా సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం తెలిపింది. 1998లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు తన ప్రభుత్వం కూలిపోకుండా ఉండేందుకు కొంతమంది ఎంపీలకు లంచం ఇచ్చారనే ఆరోపణలు రాగా.. సుప్రీంకోర్టు విచారణ నుంచి మినహాయింపునిచ్చింది.