న్యూఢిల్లీ: వ్యక్తులకు డీఎన్ఏ పరీక్షలు చేయించాలని యథాలాపంగా ఆదేశాలు ఇవ్వరాదని సుప్రీంకోర్టు సోమవారం చెప్పింది. వ్యక్తుల గౌరవ, మర్యాదలను, వివాహ బంధంలో జన్మించిన పిల్లల చట్టబద్ధతను కాపాడటానికి కట్టుదిట్టమైన రక్షణలకు లోబడి మాత్రమే ఈ ఆదేశాలివ్వాలని తెలిపింది.
ఇటువంటి పరీక్షల కోసం ఆదేశాలిచ్చే అధికారాన్ని అత్యంత సంయమనం, జాగ్రత్తలతో వినియోగించాలని పేర్కొంది. ఇటువంటి తీవ్రమైన ప్రక్రియ న్యాయ ప్రయోజనాల రీత్యా అవసరమైనపుడు మాత్రమే నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.