HomeNationalThe Supreme Court Made It Clear That The Reasons For The Arrest Of The Accused In The Money Laundering Case Can Be Communicated To Him Within 24 Hours
మనీ లాండరింగ్ కేసులో నిందితుడి అరెస్ట్‌కు గల కారణాలను అతడికి 24 గంటల్లో తెలియజేయవచ్చునని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 16: మనీ లాండరింగ్ కేసులో నిందితుడి అరెస్ట్‌కు గల కారణాలను అతడికి 24 గంటల్లో తెలియజేయవచ్చునని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. పంకజ్ బన్సాల్ కేసులో రిజర్వ్ ఉంచిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం వెలువరించింది.
నిందితుడి అరెస్ట్‌కు గల కారణాలను 24 గంటల్లోగా ఈడీ రాతపూర్వకంగా వివరించాలని జస్టిస్ బేలా ఎం త్రివేది తదితరులతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది. మనీ లాండరింగ్ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సూపర్‌టెక్ రియల్ ఎస్టేట్‌కు చెందిన రామ్ కిశోర్ అరోరా దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.