న్యూఢిల్లీ : పని ప్రదేశంలో లైంగిక వేధింపులు ఏ రూపంలో ఉన్నా దానిని తీవ్రంగా పరిగణించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన అధికారికి పెన్షన్లో 50 శాతం కోత విధించాలంటూ సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ) తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేస్తూ గువహటి హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది.
లైంగిక వేధింపుల అంశాన్ని తేలికగా తీసుకోరాదని పేర్కొంటూ వేధింపులకు పాల్పడిన నిందితునికి జరిమానా కొనసాగించాలని ధర్మాసనం తీర్పు చెప్పింది.