న్యూఢిల్లీ: తీర్పు ప్రతి పూర్తిగా సిద్ధమయ్యాకే జడ్జీలు ఆ తీర్పును వెలువరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొందరు న్యాయమూర్తులు మౌఖికంగా తీర్పులు వెలువరిస్తున్నారని కర్ణాటకకు చెందిన ఓ సివిల్ జడ్జిని కర్ణాటక హైకోర్టు డిస్మిస్ చేసింది. తీర్పు పూర్తి పాఠం సిద్ధం చేయకపోవటానికి కారణం స్టెనోగ్రాఫరేనని, సరైన నైపుణ్యం, సామర్థ్యం లేకపోవటం వల్లే అలా జరిగిందని తన చర్యలను సదరు జడ్జి సమర్థించుకొన్నారు. ఈ కేసులో జడ్జి తొలగింపు ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టేసింది. అయితే దోషిగా తేలిన సదరు జడ్జిని తొలగించాలని సుప్రీం ధర్మాసనం తీర్పు ఇచ్చింది.