న్యూఢిల్లీ: రాజస్థాన్ అజ్మీర్ జిల్లాలో 1988లో ఓ బాలికపై జరిగిన రేప్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసులో దోషి.. సంఘటన జరిగిన నాడు మైనర్. ఇప్పుడు అతడికి 53 ఏండ్లు వచ్చాయి. అయినా.. 53 ఏండ్ల వయసులో అతడికి ఎలాంటి శిక్ష విధించాలన్నది జువెనైల్ జస్టిస్ బోర్డ్ నిర్ణయిస్తుందని, గరిష్టంగా 3 ఏండ్లపాటు అతడ్ని స్పెషల్ హోమ్ కు పంపవచ్చునని ధర్మాసనం తాజాగా తేల్చింది.
దోషి ఇన్నేండ్ల తర్వాత తాను మైనర్ అనే కారణాన్ని చూపుతూ జైలు శిక్ష నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడన్న రాజస్థాన్ ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.