Ayodhya | అయోధ్యలో రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠకు ముందు కీలక ఘట్టం పూర్తి చేశారు. శ్రీరామనామ స్మరణ, వేద మంత్రోచ్ఛారణ మధ్య బాల రాముడి విగ్రహాన్ని గురువారం ఆలయం గర్భగుడిలోకి చేర్చారు. ఈ నెల 22న ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగనున్నది. ముందుగా శ్రీరాముడి విగ్రహం కండ్లకు గంతలు విప్పి, భగవంతుడి దర్శనం చేసుకున్న తర్వాత ప్రధాని మోదీ హారతి ఇవ్వనున్నారు.
కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన 51 అంగుళాల రామ్ లల్లా విగ్రహాన్ని బుధవారం రాత్రే అయోధ్యకు తీసుకొచ్చారు. గర్భగుడిలో రాముడి విగ్రహం ప్రతిష్టిస్తున్న ప్రాంతంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యులతోపాటు నిర్మోహి అఖడా మహంత్ దినేంద్ర దాస్, పూజారి సునీల్ దాస్ పూజలు చేశారు.