ఎక్కడికక్కడ పగుళ్లు ఏర్పడిన ఈ ఎలివేటెడ్ రోడ్డు మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ఉంది. 44వ జాతీయ రహదారిపై రూ.960 కోట్లతో కేంద్రం నిర్మించింది. ఇక్కడి పెంచ్ టైగర్ రిజర్వ్‌లో కింది నుంచి వన్యప్రాణులు వెళ్లేలా నిర్మాణం చేపట్టింది.
వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా సౌండ్ బ్యారియర్లు, హెడ్‌లైట్ రెడ్యూసర్లు ఏర్పాటు చేసింది. రెండేండ్ల క్రితం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ రోడ్డును ప్రారంభించారు. దీనిని ఆసియాలోనే అతిపెద్ద సౌండ్, లైట్ ప్రూఫ్ రోడ్డుగా కేంద్రంగా ఘనంగా ప్రకటించింది. అయితే, నాణ్యతా లోపం కారణంగా రెండేండ్లకే రహదారిపై ఓ వంతెన బీటలు వారింది.