న్యూఢిల్లీ, మే 30: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చుట్టూ పెరుగుతున్న దుమారంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) తొలిసారి స్పందించింది. ప్రజా చర్చలు, భిన్నమైన అభిప్రాయాలు ప్రజాస్వామ్య సమాజంలో సర్వసాధారణమని, వాటికి దిగ్భ్రాంతి చెందకూడదని ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు సునీల్ అంబేకర్ శనివారం వ్యాఖ్యానించారు. మన దేశ ప్రజాస్వామ్యం విస్తృత శ్రేణి అభిప్రాయాలు, దృక్కోణాలతో మిలితమై ఉన్నదన్నారు.
మనది చైతన్యవంతమైన సమాజం. పజాస్వామ్యంలో ప్రజలు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడాన్ని అయినా ఆశ్చర్యంగా భావించకూడదని నేను నమ్ముతున్నాను. కాబట్టి వాటిని సాధారణ ప్రక్రియలో భాగంగా పరిగణించాలి అని అంబేకర్ చెప్పుకొచ్చారు.