బెంగళూరు, మార్చి 16: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్) 2024 ఫలితాలు వెల్లడయ్యాయి. శనివారం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్.. గేట్ ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలను goaps. iisc.ac.in వెబ్సైట్లో చూడవచ్చని ప్రకటించింది.
అభ్యర్థులు స్కోర్‌కార్డులను మార్చి 23 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో గేట్ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే.